ఏదైనా వేడిగా ఉండాల్సిందే!
‌‘ఆలస్యం అమృతం విషం’‌ అంటుం‌టారు.‌ సినిమా వాళ్లూ దాన్ని నమ్ము‌తుం‌టారు.‌ అందుకే ఎప్ప‌టి‌క‌ప్పుడు ట్రెండ్‌ని సరి‌కొ‌త్తగా ఫాలో అవు‌తుం‌టారు.‌ కొత్త కొత్త సంగ‌తుల్ని ఎప్ప‌టి‌క‌ప్పుడు వేడి వేడిగా వడ్డి‌స్తుం‌టారు.‌ అనుష్క కూడా ‌‘అలాంటి సిని‌మాలే రాణి‌స్తాయి’‌ అంటోంది.‌ ‌‘‌‘విషయం ఏదైనా సరే, వేడి వేడిగా అంది‌వా‌ల్సిందే.‌ పాత ఫార్ము‌లాలు పని‌చే‌యవు.‌ ఎప్పుడో ‌‘అరుం‌ధతి’‌లాంటి సినిమా బాగా ఆడింది కదా, అని ఇప్పుడు అలాం‌టివి ప్రయ‌త్నిం‌చ‌కూ‌డదు.‌ ఎప్ప‌టి‌క‌ప్పుడు కొత్త‌దనం అంది‌వ్వ‌క‌పోతే ఫలితం ఉండదు.‌ ‌‘భాగ‌మతి’‌ని చాలా‌మంది ‌‘అరుం‌ధతి’‌తో పోల్చి చూశారు.‌ అలాం‌ట‌ప్పుడు నాకు భయం వేస్తుం‌టుంది.‌ పాత కథనో, పాత్రనో ఊహిం‌చు‌కుని ప్రేక్ష‌కుడు థియే‌ట‌ర్‌కి వస్తే చాలా ప్రమాదం.‌ ప్రేక్ష‌కుల ఆలో‌చ‌న‌లకు దగ్గ‌ర‌గానూ, దూరం‌గానూ సినిమా ఉండ‌కూ‌డదు.‌ అందుకే వాళ్లని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డా‌నికి నా వరకూ నేను ఎప్ప‌టి‌కి‌ప్పుడు ప్రయ‌త్ని‌స్తుం‌టాను’‌’‌ అని చెప్పు‌కొ‌చ్చింది.‌© Sitara 2018.
Powered by WinRace Technologies.