బుల్లితెరపై క్రిష్‌ కథ?
దర్శకుడు క్రిష్‌ ఓ టీవీ సీరియల్‌కి కథ అందిస్తున్నారా? అవుననే అంటున్నాయి కొన్ని చిత్రవర్గాలు. ‘గమ్యం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమై వినూత్న చిత్రాలతో ముందుకు సాగుతున్న క్రిష్‌కి నిజానికి అంతకుముందే బుల్లితెరతో అనుబంధం ఉంది. అప్పట్లో ‘స్వాతిచినుకులు’ సీరియల్‌ను నిర్మించారు. ప్రస్తుతం ‘మణికర్ణిక’, ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌, వరుణ్‌తేజ్‌ తారాగణంగా మరో చిత్రాన్ని రూపొందించే బిజీగా ఉన్నారాయన. విశేషం ఏమిటంటే ఇంత బిజీగా ఉండికూడా బుల్లితెర కోసం ఓ సీరియల్‌కి కథను అందిస్తున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన ఓ పడుచు సినిమా కథానాయికగా ఎలా ఎదిగిందనే ఇతివృత్తంగా ఈ సీరియల్‌ ఉండబోతోందని తెలుస్తోంది.


© Sitara 2018.
Powered by WinRace Technologies.