మహేష్‌ ఇంట్రో సాంగ్‌లో మెరిసేది తనేనా?
హేష్‌ బాబు కథానాయకుడుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు‘. సాధారణంగా మహేష్‌ ఇండ్రక్షన్‌ పాటలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిన విషయమే. ఈ సినిమాలోనూ అదే తరహాలో ఇంట్రో సాంగ్‌ని ప్లాన్ చేస్తుంది అనిల్‌ బృందం. అయితే ఈ పాటలో  గ్లామర్‌ కూడా ఉండేలా చూస్తున్నారు. ఇందుకు ఎంతోమందిని వెతికి చివరగా మిల్క్‌ బ్యూటీ తమన్నాను ఎంపిక చేయనున్నారట. ఇప్పటికే ఐటెమ్‌ సాంగ్స్‌లో మెరిసిన తమన్నా ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. గతంలో తమన్నా, మహేష్‌ కలిసి ‘ఆగడు’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.