జక్కన్నతో మహేష్‌ ఫిక్స్‌ అయినట్లేనా??

సి
నీప్రియులంతా వెండితెరపై చూడాలనుకునే అరుదైన కాంబినేషన్లలో మహేష్‌ - రాజమౌళి కలయిక ఒకటి. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారంటూ గతంలో అనేక సందర్భాల్లో వార్తలొచ్చాయి. కానీ, ఇంతవరకు ఏదీ పట్టాలెక్కలేదు. అయితే ఆ మధ్య జరిగిన ‘మహర్షి’ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు మహేష్‌. ప్రస్తుతం దీనిపైనే జక్కన్నతో చర్చలు జరుపుతున్నామని.. త్వరలోనే కొత్త కబురు వినిపిస్తామని ఓ శుభవార్త చెవిన వేసేశారు. తాజాగా దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ పూర్తయిన వెంటనే జక్కన్న మహేష్‌ చిత్రాన్నే ప్రారంభిస్తారని, ఆ సినిమాను ‘బాహుబలి’ని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు తగ్గట్లుగా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మహేష్‌ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో వాస్తవమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ.. ఒకవేళ ఒకే అయితే మాత్రం సినీప్రియులకు పండగే అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మహేష్‌ తన 26వ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.