నాగ్‌ కొత్త పచ్చబొట్టు కథ విన్నారా?

రు పదుల వయసులో ఉన్నా నేటికీ యువతరంలో మన్మథుడు నాగార్జునే. ట్రెండ్‌కు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు తన లుక్‌ను మార్చుకుంటూ కుర్రహీరోలతో పోటీ పడుతుంటాడు నాగ్‌. ఇక ఫ్యాషన్‌ పరంగా చూసినా ఆయన తన తనయులు నాగచైతన్య, అఖిల్‌లకు పోటీగా నిలుస్తుంటారు. తాజాగా ఆయన తన 60 పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే నాగ్‌ తన ఎడమ చేతిపై ఓ చిత్రమైన టాటూ వేయించుకున్నారు. తాజాగా ఈ పచ్చబొట్టు వెనకున్న కథను నాగ్‌ ‘బిగ్‌బాస్‌ 3’ షోలో పంచుకున్నారు. ''ఇది నా 30వ పుట్టినరోజు సందర్భంగా వేయించుకున్న టాటూ. మొన్ననే జరిగింది కదా(నవ్వులు). ఈ టాటూ వెనుక అర్థం ఏంటంటే, నాగుపాము కుబుసాన్ని విడిచి పెట్టేస్తుంది. నేను కూడా గతాన్ని గురించి అస్సలు పట్టించుకోను. దానిపైన ఉన్న కన్ను నాదే. జీవితంలో కొత్త విషయాలను వెతుకుతూ ఉంటానన్న గుర్తుకు కన్ను బొమ్మ. కంపాస్‌(దిక్సూచి) పైన ఉన్న 'ఎన్' అనే అక్షరం ఉత్తర దిక్కు కావచ్చు. లేదా నా పేరు కూడా కావొచ్చు. చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని అని చెప్పడం దీని అర్థం'' అని చెప్పుకొచ్చారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.