‘యన్‌.టి.ఆర్‌’పై చంద్రబాబు ప్రశంసలు

‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ చిత్రంతో నట సార్వభౌముడి జీవితాన్ని తెరపై అద్భుతంగా చూపిస్తూనే.. తెలుగు సినీ చరిత్రను అంతే అందంగా కళ్లకు కట్టారు దర్శకుడు క్రిష్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ కనబర్చిన అభినయం అందరినీ కట్టిపడేస్తోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి పాజిటీవ్‌ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. తాజాగా ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీక్షించి, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. గురువారం రాత్రి విజయవాడ బెంజిసర్కిల్‌లో ఉన్న ట్రెండ్‌ సెట్‌ మాల్‌లో కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లతో కలిసి చంద్రబాబు సినిమాను చూశారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బాలయ్య, క్రిష్‌లను ప్రత్యేకంగా సత్కరించారు. బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రను అద్భుతంగా పోషించారని అన్నారు. ‘యన్‌.టి.ఆర్‌’ సినిమాని తెరకెక్కించి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్ర రూపమిచ్చిన క్రిష్‌ను అభినందించారు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.