రంభ వస్తోంది..అహో...

ఒక‌ప్పుడు కథా‌నా‌యి‌కగా అగ్ర స్థానంలో కొన‌సా‌గింది రంభ.‌ పెళ్ల‌య్యాక సిని‌మాల్ని బాగా తగ్గిం‌చే‌సింది.‌ ‌‘యమ‌దొంగ’, ‌‘దేశ‌ము‌దురు’‌లాంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో కని‌పిం‌చింది.‌ ఆ తర‌వాత మరీ నల్ల‌పూ‌సై‌పో‌యింది.‌ ఇప్పుడు టాలీ‌వు‌డ్‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌డా‌నికి రంగం సిద్ధం చేసు‌కుం‌దని సమాచారం.‌ ఎన్టీ‌ఆర్‌ −‌ త్రివి‌క్రమ్‌ కల‌యి‌కలో ఓ చిత్రం రూపు‌ది‌ద్దు‌కొం‌టోంది.‌ ఇందులో రంభ ఓ కీలక పాత్ర పోషిం‌చ‌బో‌తోం‌దని సమా‌చారం.‌ ‌‘అత్తా‌రిం‌టికి దారేది’, ‌‘అ.‌ఆ’, ‌‘అజ్ఞా‌త‌వాసి’‌ లాంటి చిత్రాల్లో నదియా, ఖుష్బూ‌లాంటి సీని‌య‌ర్లకు మంచి పాత్రలి‌చ్చాడు త్రివి‌క్రమ్‌.‌ ఇప్పుడు రంభ కోసం స్పెష‌ల్‌గా ఓ పాత్రని తీర్చి‌ది‌ద్దా‌డని సమా‌చారం.‌ ఈ సిని‌మాతో రంభ కెరీ‌ర్‌లోనే కీల‌క‌మైన మలుపు వచ్చే అవ‌కాశం ఉందని తెలు‌స్తోంది.‌ మరి ఆ పాత్ర ఏమిటో, దాన్ని రంభ ఎలా రక్తి‌క‌ట్టి‌స్తుందో తెలి‌యా‌లంటే ఇంకొంత కాలం ఆగా‌ల్సిందే.‌


© Sitara 2018.
Powered by WinRace Technologies.