సినిమా రవిబాబుది.. విడుదల దిల్‌ రాజుది

ర్శకుడుగా మారిన నటుడు రవిబాబు. నటనలో ఎంత వైవిధ్యం చూపించాడో దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేశాడు. మొదటి నుంచి రొటీన్‌ కథలకు విభిన్నంగా సినిమాలు తెరకెక్కించే రవి ప్రస్తుతం నూతన నటీనటులతో ‘ఆవిరి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. స్టార్‌ హీరో ప్రాజెక్టులను నిర్మించే దిల్‌ రాజు కథ బావుంటే చిన్న సినిమాలను ప్రోత్సహిస్తారనే విషయం తెలిసిందే. రవిబాబు కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు తన సహాయ సహకారం అందించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.