వెంకటేష్‌ కథలో రవితేజ?

ఒక హీరో నటించాల్సిన సినిమా మరొక హీరో దగ్గరకు వెళ్లడం సహజం. రవితేజ విషయంలో ఇదే జరగబోతుందని టాక్‌. అసలు విషయం ఏంటంటే? దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్‌ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో మంచి పేరుంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్‌’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు ప్రే.క్షకుల్ని బాగా అలరించాయి. ఆ తర్వాత వెంకటేష్‌తో సినిమా చేసేందుకు ఓ కథను సిద్ధం చేసుకున్నారని, ఈ మేరకు వెంకీతో చర్చలు సాగాయని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వెంకీ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘అసురన్‌’ రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వెంకీ.. త్రినాథరావు, ప్రసన్న కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని సినీ వర్గాల సమాచారం. దీంతో వీళ్లు ఈ కథను రవితేజకు దగ్గరకు తీసుకెళ్లారట. స్ట్రిప్ట్‌ ఫుల్‌ కామెడీతో ఉండటంతో రవితేజ పచ్చజండా ఊపాడని చిత్ర సీమలో వినిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశాడు. ఈ చిత్రం తర్వాత త్రినాథరావు దర్శకత్వంలో నటిస్తాడేమో చూడాలి మరి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.