సమంత అందుకే బామ్మ కాలేదట!!

ముందుగా ఈ సినిమా అనుకున్నప్పుడు సమంతే బామ్మ అన్నారు. తీరా చిత్రీకరణ మొదలయ్యే సరికి సామ్‌ బామ్మగా మారలేదు. ఏంటీ గందరగోళమంతా అనుకుంటున్నారా? మరేంలేదు.. ప్రస్తుతం సామ ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. నందినీ రెడ్డి దర్శకురాలు. కొరియన్‌ హిట్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’కి తెలుగు రీమేక్‌ ఇది. బేబీగా మారిన ఓ బామ్మ కథతో రూపొందింది ఈ సినిమా. వాస్తవానికి ఈ చిత్ర ఒరిజనల్‌ వెర్షన్‌లో వృద్ధురాలి గెటప్‌కు, వయసులో ఉన్నప్పటి గెటప్‌ను ఒకే కథానాయిక చేసింది. కానీ, ‘ఓ బేబీ’కి వచ్చేసరికి.. యంగ్‌ క్యారెక్టర్‌ను సమంత పోషించగా.. బామ్మ పాత్రలో సీనియర్‌ నటి లక్ష్మీ నటించింది. అసలైతే.. ఈ రెండు పాత్రలను తొలుత సామ్‌తోనే చేయిద్దామనుకుందట చిత్ర బృందం. సమంత కూడా రెండు పాత్రలను చేసేందుకు ఆసక్తి చూపించిందట. కానీ, ఆ గెటప్స్‌తో మేకప్‌ టెస్ట్‌ చేయగా.. సామ్‌కు అవి ఏమాత్రం సెట్‌ అవలేదట. దీంతో చేసేదేమీ లేక ఆ బామ్మ పాత్రకు లక్ష్మిని ఎంపిక చేసుకున్నారట. మరి సినిమాపై దీని ఫలితం ఎలా ఉండబోతుందన్నది తెలియాలంటే జులై 5 వరకు వేచి చూడాల్సిందే.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.