నా మనసు అదే.. కోరుకుంటోంది!
పెళ్లయ్యాక సమంత సినీ ప్రయాణం మరింత వేగం అందుకుంది. ‘రాజుగారి గది 2’, ‘రంగస్థలం’, ‘మహానటి’... ఇలా ప్రతీ చిత్రంలోనూ తన నటనతో ఆకట్టుకుంటోంది, విజయాల్నీ అందుకుంటోంది. ‘మహానటి’లో మధురవాణి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాత్రకు గానూ తొలిసారిగా డబ్బింగ్‌ కూడా చెప్పుకుంది సమంత. తను మాట్లాడుతూ ‘‘నా మనసు ప్రస్తుతం సవాళ్లని కోరుకుంటోంది. నన్ను ఛాలెంజ్‌ చేసే పాత్ర ఏదైనా నాకు ఇష్టమే. ‘ఈ పాత్ర చేయగలుగుతానా, లేదా’ అనే భయం నాలో పుట్టాలి. అలాంటి భయాల్ని ఎక్కువగా ఇష్టపడతా. భయం ఉన్నప్పుడే ఇంకా జాగ్రత్తగా, ఇంకాస్త శ్రద్ధతో పనిచేస్తుంటా. ఈమధ్య నానుంచి మంచి సినిమాలు, మంచి పాత్రలు వస్తున్నాయంటే కారణం అదే. నటిగా ఇప్పుడు చాలామంచి స్థితిలో ఉన్నా. నా స్థానానికి మరింత గౌరవం ఇచ్చే మంచి సినిమాలు చేయడమే నా లక్ష్యం’’ అంటోంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.