ఈ అభిమానం ఎక్కడా దొరకదు!
టాలీవుడ్‌ నుంచి అంచెలంచెలుగా బాలీవుడ్‌ వరకూ ఎదగడానికి కథానాయికలు తాపత్రయపడుతుంటారు. ఒక్కసారి బాలీవుడ్‌కి వెళ్లిపోతే.. దక్షిణాది వంక తిరిగి చూడరు. కానీ పూజా హెగ్డే అలా చేయలేదు. బాలీవుడ్‌ వెళ్లిన తరవాత కూడా తెలుగు చిత్రాల్లో రాణిస్తోంది. ‘నాకు తెలుగు చిత్రసీమ అంటే ఎనలేని ప్రేమ’ అంటూ అభిమానం కురిపిస్తోంది. ‘‘బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినంత మాత్రాన తెలుగు చిత్రసీమని వదల్లేను. ఇక్కడి ప్రేక్షకులు చాలా ప్రత్యేకం. సినిమా అంటే పిచ్చి. తారల్ని కూడా అలానే అభిమానిస్తారు. సొంతింటి మనిషిలా చూసుకుంటారు. బాలీవుడ్‌ వెళ్లకముందు ఇక్కడ చేసినవి ఒకట్రెండు చిత్రాలే. అవి కూడా సరైన ఫలితాల్ని ఇవ్వలేదు. కానీ.. తెలుగునాట ఎక్కడకు వెళ్లినా నా గురించీ, నా సినిమాల గురించీ మాట్లాడుకునేవారు. ఇంతటి అభిమానం ఎక్కడా ఉండదు. అందుకే తెలుగు చిత్రసీమకి మళ్లీ తిరిగొచ్చేశాను. నేనేదీ ప్రణాళికాబద్ధంగా చేయను. ప్రవాహంతో పాటు వెళ్లిపోతుంటాను. అది నాకు కలిసొచ్చింది’’ అంది పూజ.© Sitara 2018.
Powered by WinRace Technologies.