అవకాశం కోసం ఎదురు చూస్తున్నా
బాలీవుడ్‌ అందగాడు హృతిక్‌రోషన్‌కు అమ్మాయిల ఫాలోయింగ్‌ ఎక్కువే. కథానాయికలు కూడా ఆయనతో నటించడానికి తహతహలాడతారు. ఆ జాబితాలో ముందు వరసలోనే ఉంటుంది ‘దబాంగ్‌’ సుందరి సోనాక్షి సిన్హా. సల్మాన్‌ఖాన్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అక్షయ్‌కుమార్‌ లాంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడి సూపర్‌ హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకొంది. ‘అఖిరా’, ‘నూర్‌’ లాంటి నాయికా ప్రాధాన్య చిత్రాల్లోనూ సత్తా చాటింది. కానీ తనకు ఎంతో ఇష్టమైన హృతిక్‌తో మాత్రం నటించే అవకాశం రాలేదు. ఎప్పటికప్పుడు హృతిక్‌ అంటే తనకున్న అభిమానాన్ని బయటపెడుతూనే ఉంది సోనాక్షి. మరోసారి తన మనసులో మాట చెప్పింది. ‘‘హృతిక్‌ చాలా గొప్ప నటుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఓ యాక్షన్‌ చిత్రంలో కానీ డ్యాన్స్‌ నేపథ్యంగా సాగే చిత్రంలో కానీ ఆయనతో కలసి నటించాలనేది నా కోరిక. మరి ఎప్పుడు నటిస్తానో...’’ అంటోంది సోనాక్షి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.