దేవరకొండ కోసం మరోసారి స్టైలిష్‌ స్టార్‌!!
                             

ఏడాది ఇప్పటికే ‘మహానటి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ఇప్పుడీ జోరులోనే ‘టాక్సీవాలా’గా థియేటర్లలోకి దూసుకొస్తున్నాడు. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. విజయ్‌కు జోడీగా ప్రియాంక జువాల్కర్, మాళవికా నాయర్‌ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం.. నవంబరు 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నవంబరు 11న ముందస్తు విడుదల వేడుక నిర్వహించేందుకు (ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌) సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. బన్నీ ఇంతకుముందు ‘గీత గోవిందం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరుకాగా.. అది పెద్ద హిట్‌ అయింది. ఈ నేపథ్యంలో ఆ సెంటిమెంట్‌ ఈ చిత్రంతోనూ తిరిగి కొనసాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఓ సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంతో సాగే చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి.© Sitara 2018.
Powered by WinRace Technologies.