25 పాత్రల్లో దర్శనమివ్వనున్న విక్రమ్‌!

ఒకే సినిమాలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ఎప్పుడూ ముందుంటారు తమిళ నటుడు విక్రమ్‌. గతంలో వచ్చిన ‘అపరిచితుడు’ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ‘ఐ’ చిత్రంలో రెండు పాత్రల్లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు తన 58వ చిత్రం కోసం ఏకంగా 25 పాత్రల్లో నటించనున్నాడని కోలీవుడ్‌ సమాచారం. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌- వియాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాను దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తోంది. సంగీతం ఎ.ఆర్‌. రెహమాన్‌. 2020 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.