మౌనమే ఇష్టమట..
రామ్‌కార్తీక్‌, పార్వతి అరుణ్‌ జంటగా కళా దర్శకుడు అశోక్‌ కుమార్‌ కోరాలత్‌ తెరకెక్కించిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. ఆశా అశోక్‌ నిర్మాత. ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి టీజర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమని వ్యక్తం చేయడంలో ఒక జంట మధ్య జరిగే సంఘర్షణే ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది. కవితాత్మకతతో కూడిన కథ, విజువల్స్‌ యువతని విశేషంగా ఆకట్టుకుంటాయి’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి సన్నివేశాన్నీ తనలో ఉన్న కళా నైపుణ్యంతో ఓ పెయింటింగ్‌లా తీర్చిదిద్దారు దర్శకుడు అశోక్‌. ఈ సినిమాకి సంగీతం ప్రత్యేక ఆకర్షణ. నాజర్‌ పాత్ర ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇలాంటి చిత్రంలో నటించడం నా అదృష్టం’’ అన్నారు. టీజర్‌ ఉన్నతంగా ఉందన్నారు శ్యాంప్రసాద్‌రెడ్డి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.