కథనమే ప్రధానం
నసూయ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘కథనం’. అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రధారి. రాజేష్‌ నాదెండ్ల దర్శకుడు. బి. నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో అనసూయ, రణధీర్, ధన్‌రాజ్‌లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ‘‘పేరుకి తగ్గట్టే కథ కంటే కథనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన చిత్రమిది. ప్రేక్షకుల్ని థ్రిల్లింగ్‌కి గురిచేస్తుంది. ఈ చిత్రంలో సహాయ దర్శకురాలి పాత్రలో కనిపిస్తా. టీజర్‌కి మంచి స్పందన లభించింద’’న్నారు. నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ‘‘అనసూయ అభినయం ఆకట్టుకుంటుంది. పృథ్వీ, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, రణధీర్‌ పాత్రలు బాగా నవ్విస్తాయి. టాకీ పూర్తయింది. మిగిలిన రెండు పాటల్నీ త్వరలోనే చిత్రిస్తాం. వేసవిలో విడుదల చేస్తామ’’ని అన్నారు. ‘‘అనసూయకి స్నేహితుడిగా నటిస్తున్నాను. వినోదం సమ్మిళితమై సాగే సరికొత్త థ్రిల్లర్‌’’ అని ధన్‌రాజ్‌ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, సంగీతం: సునీల్‌ కశ్యప్‌.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.