
బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ సాధినేని పవన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు ప్రారంభమైంది. నిర్మాత దిల్‌రాజ్ హీరో గణేష్‌పై క్లాప్‌నివ్వగా, దర్శకుడు వి.వి.వినాయక్ మొదటి షాట్‌కి దర్శకత్వం వహించారు. బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్, లక్కీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుని తొలి చిత్రంలా ఇది కూడా ఓ ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం. గణేష్ సరసన కథానాయికగా ఎవరు నటిస్తున్నారో ఇంకా స్పష్టత లేదు. త్వరలో టైటిల్, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు వెలువడనున్నాయి.
