భారతీయుడుకి లీకుల షాక్‌!!

అనేక అవాంతరాల అనంతరం తిరిగి సెట్స్‌పైకి వెళ్లిన ‘భారతీయుడు 2’కు లీకుల బెడద పెద్ద షాక్‌లా మారుతోంది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకొని మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రీకరణలోని కమల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీక్‌ అయ్యాయి. ఈ బయటకొచ్చిన ఫొటోలను చూస్తుంటే సెట్స్‌లోని మనుషులే ఈ చిత్రాలను లీక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోల్లో కమల్‌ సేనాపతి గెటప్‌లో గుర్రంపై కూర్చోని ఎక్కడికో వెళ్తున్నట్లుగా దర్శనమిచ్చారు. ‘భారతీయుడు’లో సేనాపతి వయసు 70కాగా ఈ చిత్రంలో 90కి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే లుక్‌ ఉండబోతున్నట్లు తాజాగా బయటకొచ్చిన చిత్రాలను చూస్తుంటే అర్థమవుతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.