పట్టాలెక్కిన ‘భీష్మ’

ఎట్టకేలకు నితిన్‌ కొత్త సినిమా ‘భీష్మ’ పట్టాలెక్కింది. ‘ఛలో’ వంటి హిట్‌తో తొలి ప్రయత్నంలోనే తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌కు జోడీగా రష్మికను ఖరారు చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ‘ఛలో’ తరహాలోనే ఇది కూడా వినోద ప్రధానమైన చిత్రంగా రూపొందబోతుందట. టైటిల్‌కు తగ్గట్లుగానే పాత్ర కథానాయకుడి పాత్ర చిత్రణ ఉంటుందని, రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెల 20 నుంచి మొదలు కానుందని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి మహతి సాగర్‌ స్వరాలు సమకూర్చబోతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.