
వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నాయికా ప్రాధాన్యం ఉన్న కథల్ని ఎంచుకుంటోంది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి ప్రధాన పాత్రలో ఈస్ట్ కోస్ట్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. నరేంద్రనాథ్ దర్శకుడు. మహేష్ కోనేరు నిర్మాత. ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ‘‘ఇది వరకే అమెరికాలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిచాం. బుధవారం నుంచి స్పెయిన్‌లో మరో షెడ్యూల్‌కు శ్రీకారం చుడుతున్నాం. కుటుంబ బంధాలకు విలువ ఇచ్చే కథ ఇది. వినోదం, భావోద్వేగాలు, చక్కటి సంగీతం కలగలసి ఉంటాయి. త్వరలోనే టైటిల్‌ని ప్రకటిస్తామ’’న్నారు నిర్మాత. రాజేంద్రప్రసాద్, నరేష్, నదియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్.
