‘మహర్షి’ డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం
హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకుడు. అశ్వనీదత్, దిల్‌రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మార్చి నాటికి చిత్రీకరన పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం హైదరాబాద్‌లో డబ్బింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చిత్రబృందం. రామోజీ ఫిలింసిటీలో ‘మహర్షి’ కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాల్ని ఇక్కడే తెరకెక్కించారు. ‘‘స్నేహం విలువ చాటిచెప్పే చిత్రమిది. అన్ని రకాల కమర్షియల్‌ హంగులు ఉంటాయి. అమెరికాలో కీలక భాగం తెరకెక్కించాం. ఏప్రిల్‌ చివరి వారంలో విడుద చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.