నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం

ఇటీవలే ‘ఓ బేబీ’ చిత్రంతో విజయం అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య జోరు పెంచాడు. ఓ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని ప్రారంభించాడు.  ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేం సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.  సోమవారం ఆ సినిమా లాంఛనంగా మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా మరో నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ పతాకంపై నారాయణదాస్ నారంగ్‌, శరత్‌మరార్,రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశాన్ని పూజా కార్యక్రమంపై చిత్రీకరించారు. క్రీడానేపథ్యంలో తెరకెక్కనుందీ చిత్రం. టైటిల్, కథానాయిక, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.