‘నాని24’ సందడి మొదలైంది

‘జెర్సీ’ తర్వాత నాని నటించబోతున్న 24వ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నానికి జోడీగా మొత్తం ఐదుగురు కథానాయికలు కనిపించబోతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్‌ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. రేపటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ సినిమాలో నాని.. 19 ఏళ్ల యువకుడిగా, పాతికేళ్ల కుర్రాడిగా, 40 ఏళ్ల మధ్య వయస్కుడిగా, 50 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా నాలుగు భిన్నమైన రూపాల్లో కనిపించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. దీని కోసం లుక్స్‌, మేకోవర్‌ పరంగా తనని తాను పూర్తిగా మార్చుకోబోతున్నాడట నాని. నాయికలుగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, కీర్తి సురేష్‌, మేఘా ఆకాశ్‌లను ఎంపిక చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మిగిలిన వారెవరన్నది అధికారికంగా ప్రటించాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యహరించనున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.