మిల్కీబ్యూటీ.. ‘నెక్ట్స్‌ ఏంటి’

వైపు సీనియర్‌ కథానాయకులతో జోడీ కడుతూనే.. మరోవైపు కుర్రహీరోలతోనూ ఆడిపాడుతూ జోరు చూపిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పుడీ భామ ‘ఎఫ్‌2’, ‘అభినేత్రి 2’, ‘దటీజ్‌ మహాలక్ష్మీ’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. వీటి మధ్యలోనే యువహీరో సందీప్‌ కిషన్‌తో ‘నెక్ట్స్‌ ఏంటి’ అనే చిత్రాన్ని సైలెంట్‌గా పట్టాలెక్కించేసిందట. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ బయటకొచ్చాయి. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ తెలుగులో రూపొందిస్తున్న తొలి చిత్రమిది. నవదీప్, పూనమ్‌ కౌర్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. లండన్, హైదరాబాద్‌లలో చిత్రీకరణ జరపుతున్నారు. పూర్తి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటిచింది. డిసెంబరు చివరి నాటికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లియోన్‌ జేమ్స్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని రైనా జోషి, అక్షయ్‌ పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.