
వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ ‘రంగ్‌దే’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ నిచ్చారు. అక్టోబరు 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2020 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం దేవీశ్రీ ప్రసాద్.