సాయిధరమ్‌ కొత్త చిత్రం ప్రారంభం

ఇటీవలే విడుదలైన ‘చిత్రలహరి‘ చిత్రంతో మంచి విజయం అందుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ మరో సినిమాను ప్రారంభించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశిఖన్నా కథానాయకి. సోమవారం లాంఛనంగా షూటింగ్‌ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌నివ్వగా అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కథతో రూపొందించనున్నట్లు సమాచారం. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. గతంలో ‘సుప్రీం’ సినిమాతో సూపర్‌ జోడిగా పేరుతెచ్చుకున్న సాయి ధరమ్‌ తేజ్, రాశిఖన్నా మరోసారి మెప్పించనున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.