ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్‌’గా వస్తున్నాడు.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరీ మూడో సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రానికి ‘రొమాంటిక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. ఆకాశ్‌ఫోటోతో కూడిన టైటిల్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. అనిల్‌ పాడూరి దర్శకత్వంలో రూపొందబోతోంది. పూరి జగన్నాథ్‌ స్కీన్ర్‌ ప్లే, డైలాగులు, కథ అందించనున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. గతేడాది ‘మెహబూబా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆకాశ్‌. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.