రకుల్‌ సోదరుడు హీరోగా..

కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ హీరోగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఆయన నటిస్తోన్న తొలి చిత్రం. దీనికి దాసరి లారెన్స్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మౌనిక శర్మ కథానాయిక. రజనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు రకుల్‌, ఆమె స్నేహితులు నటి మంచు లక్ష్మి, నటులు సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్రన్‌ కూడా హాజరయ్యారు. తొలి సన్నివేశానికి రకుల్‌ క్లాప్‌ కొట్టారు. మంచు లక్ష్మి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి షాట్‌కు సందీప్‌, రాహుల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అమన్‌ ఇప్పటికే ‘రాక్‌ అండ్‌ రోల్‌’ అనే లఘు చిత్రంలో నటించారు.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.