‘అ.అ.ఆ’ ఇప్పుడేం చేస్తున్నాంటే..

రవితేజ మూడు పాత్రల్లో నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇలియానా కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. టాకీ పూర్తయింది. రెండు పాటలు తెరకెక్కించాల్సివుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రవితేజ ప్రస్తుతం డబ్బింగ్‌ చెబుతున్నారని, త్వరలోనే మిగిలిన రెండు పాటల్నీ చిత్రీకరిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘‘రవితేజ, శ్రీనువైట్ల ఇద్దరూ వినోదాన్ని నమ్ముకున్నవాళ్లే. ఈ చిత్రంలోనూ వినోదం పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు ఓ కొత్త పాయింట్‌ కనిపిస్తుంది. కథ, కథనాల్లో ఉత్కంఠత ఆకట్టుకుంటుంది. రవితేజ పాత్రలు మూడూ వేటికవే భిన్నంగా ఉంటాయి. సాంకేతికంగానూ ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్‌ విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: తమన్‌.© Sitara 2018.
Powered by WinRace Technologies.