సంక్రాంతి రేసులో శర్వా ‘శ్రీకారం’


హేష్‌బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్‌, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌ వంటి స్టార్‌ హీరోలంతా రాబోయే ముగ్గుల పండుగ కోసం ఇప్పటి నుంచే ముస్తాబవుతుండగా.. ఇప్పుడు మరో యువ హీరో కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరాడు. తాజాగా శర్వానంద్‌ ‘శ్రీకారం’ పేరుతో మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు. నూతన దర్శకుడు కిషోర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయిమాధవ్‌ బుర్రా ఈ సినిమాకు రచన సహకారం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ క్లాప్‌ కొట్టగా.. శశికాంత్ వల్లూరి కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. ఆగస్టు తొలి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శర్వా నటిస్తోన్న 29వ చిత్రమిది. కథానాయిక ఎవరన్నది త్వరలోనే ప్రకటిచనున్నారు. ఇక శర్వానంద్‌ నుంచి రాబోయే తాజా చిత్రం ‘రణరంగం’ ఆగస్టులో థియేటర్లలోకి రానుంది.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.