ప్రేమగీతాల ‘సవ్యసాచి’

అక్కినేని నాగచైతన్య, సమంతల ప్రేమ మొగ్గ తొడిగింది ఎక్కడో తెలుసా? న్యూయార్క్‌లో. అందుకే నాగ‌చై‌త‌న్యకి న్యూయా‌ర్క్‌తో విడదీయరాని ప్రత్యే‌క‌మైన అనుబంధం ఏర్పడింది.‌ ‌‘ఏమాయ చేసావె’‌ చిత్రాన్ని న్యూయా‌ర్క్‌లో తెర‌కె‌క్కి‌స్తున్న సమ‌యంలోనే కథా‌నా‌యిక సమం‌తతో ప్రేమలో పడి‌పో‌యాడు.‌ ఆ ప్రేమ పెళ్లితో సుఖాం‌త‌మైంది.‌ అందుకే న్యూయా‌ర్క్‌కి ఎప్పుడు వెళ్లినా తమ ప్రేమకి సంబం‌ధిం‌చిన జ్ఞాప‌కాల్ని గుర్తు చేసు‌కొం‌టుం‌టాడు నాగ‌చై‌తన్య.‌ అలాంటి చోట మరొ‌క‌సారి ప్రేమకి సంబం‌ధిం‌చిన సన్ని‌వే‌శాల్ని తెర‌కె‌క్కిస్తే అవి ఎలా పండు‌తాయో ప్రత్యే‌కంగా చెప్పాలా? మరో‌సారి నాగ‌చై‌తన్య ప్రేమ సన్ని‌వే‌శా‌లతో మాయ చేయడం ఖాయ‌మని చెబు‌తోంది ‌‘సవ్య‌సాచి’‌ చిత్రబృందం.‌ నాగ‌చై‌తన్య, నిధి అగ‌ర్వాల్‌ జంటగా చందు మొండేటి దర్శ‌క‌త్వంలో తెర‌కె‌క్కు‌తున్న చిత్రమిది.‌ చందు మొండేటి దర్శ‌కత్వం వహి‌స్తు‌న్నారు.‌ మైత్రీ మూవీ మేకర్స్‌ పతా‌కంపై నవీన్‌ ఎర్నేని, యల‌మం‌చిలి రవి‌శం‌కర్, మోహన్‌ (సి.‌వి.‌ఎమ్‌) నిర్మి‌స్తు‌న్నారు.‌ ప్రస్తుతం న్యూయా‌ర్క్‌లో పాట‌లతో పాటు, ప్రేమకి సంబం‌ధిం‌చిన కొన్ని సన్ని‌వే‌శాల్ని తెర‌కె‌క్కి‌స్తు‌న్నారు.‌ యాక్షన్‌ థ్రిల్ల‌ర్‌గా రూపొం‌దు‌తున్న ఈచి‌త్రంలో మాధ‌వన్‌ ఓ కీలక పాత్ర పోషి‌స్తు‌న్నారు.‌ కీర‌వాణి స్వరాలు సమ‌కూ‌రు‌స్తు‌న్నారు.‌
సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.