‘సింహ’గర్జన షురూ అయింది

నందమూరి బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కలయికలో ‘జై సింహా’ వచ్చింది. గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి పనిచేస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా హ్యాపీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌నిచ్చారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు పరుచూరి మురళి కథ అందించారు. వచ్చే నెలలో షూటింగ్‌ మొదలెడతాం. కథానాయిక, మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తామ’’న్నారు నిర్మాత. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాంప్రసాద్, కళ: చిన్నా, మాటలు: రత్నం.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.