ఆధ్యాత్మిక అనుభూతి

సుమన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సింహనాదం’. పి.శ్రీనివాస్‌ దర్శకుడు. శ్రీలిఖిత మూవీ మేకర్స్, శ్రీవైష్ణవ స్పిరిటైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ‘‘ఇదో ఆధ్మాత్మిక చిత్రం. శ్రీనరసింహస్వామి మహిమల్ని తెరపై చూపిస్తున్నాం. విజయ్‌ కురాకుల అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామ’’న్నారు. ఇదే వేదికపై శ్రీ అహోబిల నరసింహ స్వామిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనల్ని ‘సర్వం సింహమయం’ పేరుతో ఆవిష్కరించారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.