సందీప్‌కిషన్ ఇప్పుడు తెనాలి రామకృష్ణుడిగా మారబోతున్నారు. ఆయన కథానాయకుడిగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక కథానాయిక. ఈ చిత్రానికి ‘తెనాలి రామకృష్ణుడు బీఏబీఎల్’ అనే పేరు ఖరారు చేశారు. ఈనెల 14న చిత్రీకరణ ప్రారంభిస్తారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మాతలు. ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. వెన్నెలకిషోర్, మురళీ శర్మ, పృథ్వీ కీలక పాత్రల్లో కనిపిస్తారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నార’’ని చిత్రబృందం ప్రకటించింది. కథ: రాజసింహా, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, మాటలు: నివాస్, భవానీ ప్రసాద్.