మూడు భాషలు.. మూడు మల్టీస్టారర్లు!

టాలీవుడ్‌ మన్మథుడు కింగ్‌ నాగార్జున వరుస మల్టీస్టారర్‌లతో జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో నానితో కలిసి ‘దేవదాస్‌’లో నటిస్తుండగా.. మరోవైపు బాలీవుడ్‌ భారీ బడ్జెట్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ కోసం రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి పనిచేయబోతున్నాడు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను మొదలుపెట్టాడు. తమిళ్‌లో ధనుష్‌ ప్రధానపాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు నాగార్జున ఓకే చెప్పాడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ చెన్నైలో ప్రారంభమైంది. ఇందులో నాగార్జున ఇరవై నిమిషాల పాటు కనిపించనుండగా ఆయన లుక్‌ చాలా సరికొత్తగా ఉండబోతుందని తెలిసింది. దీంట్లో నాగ్‌తో పాటు తమిళ నటులు ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషించబోతున్నారు. అదితిరావ్‌ హైదరీ, మేఘా ఆకాష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తేనాండ్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మొత్తానికి నాగ్‌ ముచ్చటగా మూడు భాషల్లో మూడు మల్టీస్టారర్‌లలో నటిస్తూ కుర్రహీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. అన్నట్లు నాగ్‌ త్వరలోనే మలయాళంలోనూ ఓ మల్టీస్టారర్‌ను షురూ చేసే అవకాశాలున్నట్లు ఫిలిం నగర్‌ టాక్‌. ప్రస్తుతం దీని కోసం కథా చర్చలు నడుస్తున్నాయట.© Sitara 2018.
Powered by WinRace Technologies.