వరుణ్‌ విలనిజం చూపిస్తాడట!!
కథల ఎంపికలో మొదటి నుంచీ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు వరుణ్‌తేజ్‌. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్న ఆయన త్వరలోనే ‘అంతరిక్షం’, ‘ఎఫ్‌2’ చిత్రాలతో సందడి చేయబోతున్నారు. ఆ రెండు కూడా భిన్నమైన కథలతో తెరకెక్కుతున్నవే. తదుపరి వరుణ్‌ తమిళ చిత్రం ‘జిగర్తాండ’ రీమేక్‌లో నటించబోతున్నారు. హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రంలో వరుణ్‌ పాత్ర ప్రతినాయక ఛాయలతో సాగుతుందని సమాచారం. ఇందులో కథానాయికగా రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తోంది
.


© Sitara 2018.
Powered by WinRace Technologies.