‘వీడు అసాధ్యుడు’సామాజిక కథాంశం
కృష్ణసాయి, జహీదా శామ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘వీడు అసాధ్యుడు’. పి.ఎస్‌. నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎస్‌.కె. రాజు నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా క్లాప్‌నిచ్చారు. నిర్మాత సీతారామరాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. నటుడు శివకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సామాజిక స్పృహ కలిగిన కథని కమర్షియల్‌ కోణంలో తెరకెక్కిస్తున్నాం. కొందరు దుర్మార్గుల వల్ల న్యాయవాద వృత్తిలో వున్న యువకుడికి అన్యాయం జరుగుతుంది. వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే కథ. మరో నాయికని ఎంపిక చేయాల్సి వుంది’’ అని అన్నారు. ‘‘సెప్టెంబర్‌ నుంచి చిత్రీకరణ కొనసాగుతుంది. మూడు షెడ్యూల్స్‌తో పూర్తిచేస్తామ’’న్నారు నిర్మాత. ‘‘కథానుగుణంగా సాగేలా ఐదు పాటలుంటాయ’’ న్నారు సంగీతదర్శకుడు శంభుప్రసాద్‌. ఈ మాటలు: త్యాగరాజు, ఛాయాగ్రహణం: విజయ్‌కుమార్‌ అడుసుమిల్లి© Sitara 2018.
Powered by WinRace Technologies.