‘విరాటపర్వం’కు శ్రీకారం

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ క్లాప్‌నిచ్చారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాతలు దర్శకుడికి స్క్రిప్టుని అందజేశారు. ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ వచ్చే వారం నుంచి మొదలవుతుంది. ప్రముఖ నటి టబు ఇందులో మానవ హక్కుల పోరాట నాయకురాలిగా నటించనుందని సమాచారం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దివాకర్‌ మణి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కళ: నాగేంద్ర. సినిమా ప్రారంభోత్సవంలో నాయకానాయికలతో పాటు... నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, వై.రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్‌ అగర్వాల్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, చందు మొండేటి, అజయ్‌ భూపతి, వెంకటేష్‌ మహా, సునీల్‌ నారంగ్‌ తదితరులు పాల్గొన్నారు.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.