సరికొత్త ప్రేమకథ ‘అది ఒక ఇదిలే’

నృత్య దర్శకురాలు స్వర్ణ కెప్టెన్‌ కుర్చీ ఎక్కారు. ‘అది ఒక ఇదిలే’ పేరుతో స్వీయ నిర్మాణంలో ఒక ప్రేమకథని తెరకెక్కిస్తున్నారు. సవ్యసాచి,  రాధికాప్రీతి నాయకానాయికలు. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘850 సినిమాలకి నృత్యాలు  సమకూర్చిన స్వర్ణ మాస్టర్‌ దర్శకురాలిగా చేసిన చిత్రమిది. ట్రైలర్‌ చూస్తే ఒక ఫ్లాట్‌లో గడిపే జంట మధ్య ప్రేమకథ అనిపిస్తోంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకనిర్మాత స్వర్ణ మాట్లాడుతూ ‘‘ప్రేమకథతో అందరికీ వినోదం పంచేలా  తీర్చిదిద్దా. సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకుంది’’ అన్నారు.‘‘ఆడిషన్స్‌ చేసి మమ్మల్ని ఎంపిక చేసుకొన్నారు స్వర్ణ మేడమ్‌. నృత్య దర్శకురాలిగా 850    సినిమాల అనుభవం ఉన్న స్వర్ణ మేడమ్‌తో సినిమా చేయడం ఒక కలలా అనిపించింద’’న్నారు నాయకానాయికలు. రాహుల్‌, హారిక, రక్ష, తరుణ్‌, అప్పాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీధర్‌ నర్లార్‌, సంగీతం: మురళీధర్‌ రాగి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.