‘సైకిల్‌’ ప్రేమ

పునర్నవి భూపాలం, మహత్‌ రాఘవేంద్ర, శ్వేతావర్మ, సూర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘సైకిల్‌’. ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకుడు. పి.రాంప్రసాద్‌, డి.నవీన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణతో పాటు డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘హాస్య ప్రధానమైన కథకి, ప్రేమలోని మేజిక్‌ తోడైతే ఆ సినిమా ఎంత కొత్తగా ఉంటుందో తెరపై చూపించబోతున్నాం. సైకిల్‌ అనే పేరుని ఎందుకు పెట్టామనేది తొలి సన్నివేశంలోనే తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయంతో ముడిపెడుతూ ఈ సినిమాని ముందుకు నడిపించాం. త్వరలోనే టీజర్‌తోపాటు పాటల్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. సుదర్శన్‌, అనితా చౌదరి, మధుమణి, నవీన్‌ నేని, లక్ష్మణ్‌, అన్నపూర్ణమ్మ, జోగి బ్రదర్స్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్‌, సంగీతం: జి.ఎం.సతీష్‌, కూర్పు: గడుతూరి సత్య, కళ: రామ్‌కుమార్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.