విభిన్న కథాంశం ‘పైసా పరమాత్మ’


సుచిత్ర క్రియేషన్స్‌ పతాకంపై సంకేత్‌, సుధీర్‌, రమణ, అనూషలు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పైసా పరమాత్మ’. విజయ్‌ కిరణ్‌ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకొంటోందీ చిత్రం. స్వరాలను కనిష్క సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా విజయవంతమవ్వాలి, నటీనటులు, దర్శకుడికి మంచి అవకాశాలు రావాలి’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్న నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతులు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఆతరువాత వాళ్లు ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారా లేదా అనేది కధాంశం’’ అన్నారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ ‘‘ సందర్భానికి తగ్గట్టు పాటులంటా’’యన్నారు. ఛాయాగ్రహణం: జిఎల్‌ బాబు, కూర్పు: అనిల్‌ జల్లు, నిర్మాత: విజయ్‌జగత్‌.


© Sitara 2018.
Powered by WinRace Technologies.