ప్రతి అమ్మాయి కథ ఇది

కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. నరేంద్ర దర్శకుడు. మహేష్‌ కోనేరు నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ క్లాప్‌ కొట్టారు. వెంకీ అట్లూరి, బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ స్విచ్చాన్‌ చేశారు. హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ‘‘మహానటి తరవాత నేను నటిస్తున్న మహిళా ప్రధానమైన చిత్రమిది. కథ నాకు బాగా నచ్చింది. ప్రతీ అమ్మాయి జీవితంలో ఎదురయ్యే సంఘటనలే తెరపై కనిపిస్తాయి. ఎక్కువ భాగం అమెరికాలో తెరకెక్కిస్తార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మూడేళ్ల నుంచి ఈ కథపై కసరత్తు చేస్తున్నా. అన్నిరకాల భావోద్వేగాలూ ఇందులో ఉంటాయి. కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలవుతుంది. ఏప్రిల్‌లో అమెరికా వెళ్లబోతున్నాం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మహిళా ప్రధాన చిత్రమిది. ప్రతి అమ్మాయి తన కథని తాను తెరపై చూసుకున్నట్టు ఉంటుంది. కీర్తి సురేష్‌ సినీ ప్రయాణంలో మంచి పాత్రగా మిగిలిపోతుంది. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తామ’’న్నారు. ‘‘ప్రేక్షకుల్ని మెప్పించే పాటల్ని అందిస్తా’’నన్నారు కల్యాణి కోడూరి.© Sitara 2018.
Powered by WinRace Technologies.