సూపర్‌ మార్కెట్‌లో సరదాలు

ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌ మార్కెట్‌’. ఎల్లా ఘోష్‌ నాయిక. బీజీఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టూడియో సంస్థ నిర్మించింది. శ్రీనాథ్‌ పులకరం దర్శకుడు. శుక్రవారం విడుదల అవుతోంది. హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘హాస్యనటుల ఇంటి నుంచి వచ్చిన వారసులు హాస్య పాత్రలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ.. కృష్ణ హీరోగానూ ఎదగాలి. మంచి పేరు సంపాదించాల’’న్నారు. నరేష్‌ మాట్లాడుతూ ‘‘గౌతంరాజు అజాత శత్రువు. నాలుగు వందల సినిమాల్లో నటించాడు. ఆయన తనయుడికీ మంచి భవిష్యత్తు ఉంద’’న్నారు. ‘‘ఈ సినిమా కోసం మా అబ్బాయి పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు గౌతంరాజు. ‘‘కథ నచ్చింది. ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఈ కథలో ఉన్నాయ’’న్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో అనిల్‌ రావిపూడి, కృష్ణభగవాన్‌, అలీ, రాజీవ్‌ కనకాల, చిట్టిబాబు, బెనర్జీ, రవిప్రకాష్‌, అంబికాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.