ఆ మాటలు వింటుంటే ఆనందంగా ఉంది

‘ఖడ్గం’, ‘మహాత్మ’ తరవాత నా పాత్రకు అంత మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం ‘మార్షల్‌’. చాలా రోజుల తరవాత ఓ మంచి చిత్రం చూశామని సన్నిహితులు చెప్పడం ఆనందాన్ని కలిగించింద’’న్నారు శ్రీకాంత్‌. ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం ‘మార్షల్‌’. అభయ్‌, మేఘా చౌదరి జంటగా నటించారు. జయరాజ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులకూ బాగా నచ్చింది. చిత్రసీమకు చెందిన కొంతమంది ఫోన్లు చేసి ‘మార్షల్‌’కి పురస్కారాలు వస్తాయి’ అంటున్నారు. ఆ మాటలు వింటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా వెనుక దర్శకుడి కష్టం చాలా ఉంది. తను తప్పకుండా మంచి దర్శకుడు అవుతాడ’’న్నారు. అభయ్‌ మాట్లాడుతూ ‘‘తొలి రోజు వసూళ్లు కాస్త నిరాశ పరిచాయి. అయితే మౌత్‌ టాక్‌ వల్ల రెండో రోజు నుంచి వసూళ్లు పెరిగాయి. శ్రీకాంత్‌గారితో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగా’’ అన్నారు. ‘‘చక్కటి సందేశానికి కమర్షియల్‌ అంశాలు మేళవించాం. శ్రీకాంత్‌ నటన ప్రధాన ఆకర్షణ’’అన్నారు దర్శకుడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.