న్యూజిలాండ్‌లోని ఓ చర్చిలో..

నందితరాజ్‌ ప్రధానపాత్రధారిగా నటించిన చిత్రం ‘విశ్వామిత్ర’. సత్యం రాజేష్‌ కీలకపాత్రలో నటించారు. మాధవి అద్దంకి, ఎస్‌.రజనీకాంత్‌తో కలిసి రాజకిరణ్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ను నందితరాజ్‌ విడుదల చేశారు. అనంతరం రాజకిరణ్‌ మాట్లాడుతూ ‘‘న్యూజిలాండ్‌లోని ఓచర్చిలో జరిగిన సంఘటన, అమెరికాలో జరిగిన ఇంకో సంఘటన మేళవింపుగా ఈ కథను తీర్చిదిద్దాం. ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. అనూప్‌ రూబెన్స్‌ చక్కటి స్వరాలు అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’న్నారు. సత్యం రాజేష్‌ మాట్లాడుతూ ‘‘కథలో కీలకమైన పాత్రలో నటించా. నా పాత్రను దర్శకుడు ఆసక్తికరంగా తీర్చిదిద్దార’’న్నారు. ‘‘ఈ కథ బాగా నచ్చి చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంద’’ని చెప్పింది నందిత. ‘నా పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకుల్ని నవ్విస్తాను’’అని చెప్పింది విద్యుల్లేఖ రామన్‌ తెలిపారు.
© Sitara 2018.
Powered by WinRace Technologies.