‘దేవ్‌’ యాక్షన్‌ సినిమా

ఖాకి’ కోసం తొలిసారి జంటగా నటించారు కార్తి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే మరోసారి జోడీ కట్టారు. వీరిద్దరూ కలసి నటించిన చిత్రం ‘దేవ్‌’. నిక్కీ గల్రాని, ప్రకాష్‌రాజ్, రమకృష్ణ కీలక పాత్రధారులు. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్, ఠాగూర్‌ మధు నిర్మాతలు. ఈనెల 14న పాటల్ని విడుదల చేస్తారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. కుటుంబ అనుబంధాలకూ స్థానం ఉంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. కార్తి, రకుల్‌ జంట మరోసారి ఆకట్టుకుంటుంద’’న్నారు. సంగీతం: హరీష్‌ జయరాజ్‌

సంబంధిత వ్యాసాలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.