నిర్మాత రమేష్‌కు సతీవియోగం

ప్రముఖ నిర్మాత, ప్రసాద్‌ గ్రూప్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ భార్య  అక్కినేని విజయలక్ష్మి (77) కన్నుమూశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. విజయలక్ష్మి స్వస్థలం మద్రాసు. 1963లో రమేష్‌ ప్రసాద్‌తో వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు ముగిశాయి. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.