ఉత్తరాది , దక్షిణాది లో స్టార్ హీరోలతో సమానంగా ప్రతినాయకుడిగా నటించిన మహేష్ ఆనంద్(57) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆయన ఇంటిలో మృతదేహాన్ని గుర్తించారు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతికి కారణాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఆయన మరణించి రెండు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభించకపోవటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆయన భార్య మాస్కోలో ఉండటంతో పశ్చిమ అందేరిలోని యారి రోడ్లో మహేష్ ఆనంద్ ఒంటరిగా ఉంటున్నారు. ఆయన చివరిసారిగా గోవింద హీరోగా నటించిన రంగేలీ రాజా సినిమాలో కనిపించారు. తెలుగులో నెంబర్ వన్, టాప్ హీరో, బాలు లాంటి సినిమాల్లో నటించారు.