అందాల తార కర్రసాము చూశారా

న అందాలతో కుర్రాళ్లకు ‘హర్ట్‌ ఏటాక్‌’ తెపించే భామ అదా శర్మ. ఇప్పుడు కర్రసాముతో నా జోలికి వస్తే ఖబద్దార్‌ అంటూ భయపెడుంది. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ‘కమెండో3’ కోసం తను మార్షల్‌ ఆర్ట్స్‌ సాధన చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. సముద్రం తీరంలో ఆమె ఎంతో నైపుణ్యంగా కర్రసాము చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా సిరీస్‌లోని రెండవ భాగంలో భావన రెడ్డి అనే పోలీస్‌ అధికారి పాత్రలో నటించింది అదా శర్మ. ఇప్పుడు ఈ ఫ్రాంచేజ్‌ మూడవ భాగంలో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. ‘మీకు సెక్యూరిటీగా దేశి బాడిగార్డ్‌ కావలసిన వారు వెంటనే రిజిస్టర్‌ చేసుకోండి, ఎందుకంటే ఈ నెల 29వ తేదీన కమెండో 3 విడుదల తరువాత భావనా రెడ్డి పుల్‌ బిజీ’ అంటూ సరదా వ్యాఖ్యను ఈ వీడియోకి జతచేసింది. ఈ అందాల భామ మార్షల్‌ ఆర్ట్స్‌ నైపుణ్యం అద్భుతం అంటున్నారు నెటిజన్లు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.